ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎంపిక

ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎంపిక

చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాతే పార్టీ నిర్ణయిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి రజియా సుల్తానా తెలిపారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్జిత్ సింగ్ చన్నీ, సునీల్ జాఖర్ నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్తుందని చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంలో పార్టీలో ఎలాంటి పోటీ లేదని సోమవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. ‘ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొని, పార్టీ గెలవగానే సీఎంను ఎన్నుకుంటాం. పార్టీ సంప్రదాయం కూడా అదే. సిద్ధూ, చన్నీ, జాఖర్ ముగ్గురూ మంచి నేతలు. తక్కువ సమయంలోనే చన్నీ చాలా చేశారు. అదే సమయంలో సిద్ధూ నిజాయితీ కలిగిన వ్యక్తి, భావోద్వేగాలు ఎక్కువ. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేత (సీఎం) నిర్ణ యం జరుగుతుంది. గత పర్యాయం పార్టీలోని అందరినీ సంప్రదించిన తర్వాతే కెప్టెన్ అమరీందన్ సింగ్ పేరును ప్రకటించినట్లు’ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos