పోలవరం పనులు పునఃప్రారంభం

విజయవాడ : పోలవరం పనులను గతంలో చెప్పినట్లే నవంబర్ 1న ప్రారంభించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరంపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2021 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.800 కోట్లు ఆదాయం వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేస్తామన్నారు. వరద జలాలతో రాయలసీమలో 86 శాతం ప్రాజెక్టులు నిండాయని తెలిపారు. తెదేపా హయాంలో పెండింగ్ పనులు పూర్తి చేయక పోవడం వల్లే పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నింపలేకపోయామని ఆరోపించారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు ఉన్న అన్ని ప్రతిపాదనలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. తెలంగాణ భూభాగం నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్టుతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos