ఎన్ఎంపీ కాదు పట్ట పగలు దోపిడీ

ఎన్ఎంపీ కాదు పట్ట పగలు దోపిడీ

న్యూఢిల్లీ : నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) ప్రయోజనాలపై నమ్మకం ఉంటే ముందు ఆర్ఎస్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ -భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్)ను ముందుగా ఒప్పంచాలని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం వరుస ట్వీట్లలో కేంద్రాన్ని సవాలు చేశారు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా బీఎంఎస్ ఈ నెల 9న తలబెట్టిన దేశవ్యాప్త నిరసనలను ప్రస్తావించారు. ఎన్ఎంపీ ప్రకటనకు ముందు బీఎంఎస్ను సంప్రదించారా లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 3న తాను ముంబైలో లేవనెత్తిన 20 ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నిజం ఏమిటంటే వాళ్లు ఏ ఒక్కరినీ సంప్రదించలేదు. చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద ప్రకటనలు చేసే ఆర్థిక మంత్రి ముంబైలో నేను లేవనెత్తిన 20 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండు చేసారు. మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ను పట్ట పగలు దోపీడీగా అభివర్ణించారు. 70 పబ్లిక్ సెక్టార్ యూనిట్లను (పీఎస్యూలు) మానిటైజ్ చేయాలనే కేంద్రం ఆలోచనకు వ్యతిరేకంగా నవంబర్ 2న దేశంలోని అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల వద్ద బీఎంఎస్ నిరసనలు చేపట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos