పవన్‌ లాంగ్‌మార్చ్‌పై సెటైర్లు..

పవన్‌ లాంగ్‌మార్చ్‌పై సెటైర్లు..

ఇసుక కొరత కారణంగా ప్రజలు,కార్మికులు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన లాంగ్‌మార్చ్‌పై సెటైర్లు పేలుతున్నాయి.లాంగ్‌మార్చ్‌ అంటే ఏంటో ఒకసారి చరిత్ర తెలుసుకొని ఆపై లాంగ్‌మార్చ్‌ పేరు పెట్టి ఉంటే బాగుండేదంటూ సలహాలు ఇస్తున్నారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా చైనా ఆవిర్భవించడానికి కేంద్రబిందువైన సందర్భం అది. లక్షలాది మంది పాల్గొన్న చైనా లాంగ్ మార్చ్.. పేరుకు తగ్గట్టు సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది.చైనా లాంగ్‌మార్చ్‌ పది వేల కిలోమీటర్లు. ఏడాదిన్నర కాలం పాటు ఈశాన్య ప్రాంతం నుంచి వాయువ్య చైనా వరకు కొనసాగింది.చైనా పితామహుడిగా పేరున్న మావో జెడాంగ్ ను సర్వశక్తిమంతుడైన నేతగా ఆవిర్భవించడానికి కారణమైన లాంగ్‌మార్చ్‌ అది.చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేలాది మంది రెడ్ ఆర్మీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. 1934 నుంచి 1935 వరకు దశలవారీగా కొనసాగింది. 24 పర్వత శ్రేణులు, 18 నదులను దాటుకుని నిర్దేశిత గమ్యాన్ని అందుకున్నారు రెడ్ ఆర్మీ సభ్యులు. చైనా ఈశాన్య ప్రాంతంలోని జియాంగ్ఝీ ప్రావిన్స్ నుంచి వాయవ్య ప్రాంతంలోని షాంగ్ఝీ వరకు కొనసాగింది.ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వెనుదిరగలేదు రెడ్ ఆర్మీ. ఈ రెండు ప్రావిన్స్ ల మధ్య పది వేల కిలోమీటర్ల దూరం వరకు నడిచారు.నిర్దేశిత మార్గంలో పర్వత శిఖరాలు, నదులు ఎదురైనా మడమ తిప్పలేదు. వాటిని అధిగమించి, గమ్యస్థానానికి చేరుకున్నారు.చైనా దశ, దిశను సమూలంగా మార్చేసిన లాంగ్‌మార్చ్‌ అది. ఆధునిక చైనాకు బీజం పడిందీ అక్కడే. చైనాను సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన మావో జెడాంగ్ ఈ లాంగ్‌మార్చ్‌కు నాయకత్వాన్ని వహించారు.అయితే ఇసుక కొరత వల్ల ప్రజలు,కార్మికులు పడుతున్న ఇబ్బందులను తెలియజేయడానికి ఆదివారం పవన్ పిలుపునిచ్చిన లాంగ్మార్చ్ కేవలం రెండున్నర కిలోమీటర్లకు మాత్రమే పరిమితం కావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆరంభం కానుంది. రామాటాకీస్, అశీల్ మెట్ట మీదుగా సాగుతుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ముగుస్తుంది. ఈ రెండింటి మధ్య దూరం రెండున్నర కిలోమీటర్లేనని, దీనికి లాంగ్‌మార్చ్‌ అని పేరు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos