పూరీ జగన్నాథ ఆలయం అంతు చిక్కని రహస్యం..

  • In Tourism
  • September 7, 2019
  • 342 Views
పూరీ జగన్నాథ ఆలయం అంతు చిక్కని రహస్యం..

భారతదేశంలోని అతిపురాతన,అద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుడి ఆలయం కూడా ఒకటి. సోదరీ సోదర సమేతంగా కొలువుదీర జగన్నాథుడు కొలువై ఉన్న పూరీ జగన్నాథ ఆలయం చార్ ధామ్ క్షేత్రాలలో ముఖ్యమైనది.బంగాళాఖాతం తీరాన ఒరిస్సారాష్ట్రం రాజధాని భువనేశ్వర్ నుండి 60కిమీ దూరంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు అనే రాజు నిర్మించారని,12 వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగదేవ్ కట్టించారని వాదనలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. ప్రతీ సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతుంది.పూరీ జగన్నాథ ఆలయం ఎంత పవిత్రతను,విశిష్టతలను కలిగిఉందో అంతే రహస్యాలు కూడా కలిగిఉంది.వాటిలో కొన్ని రహస్యాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే..
ఆలయంపై జెండా..
అన్ని దేవాలయాల గోపురాలపై ఉండే జెండాలతో పోలిస్తే పూరీ జగన్నాథ ఆలయంపై ఎగిరే జెండా చాలా ప్రత్యేకమైనది,ఎవరికీ అర్థం కానిది. సాధారణంగా దేవాలయాలపై ఉండే జెండాలు గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతాయి కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్నవైపుగా కాకుండా, వ్యతిరేక దిశలో ఊగుతుంది.అలా వ్యతిరేక దిశలో ఎందుకు,ఎలా ఊగుతుందో ఎవరికీ అర్థం కానీ రహస్యం..

ఆలయంపై జెండా..


సుదర్శన చక్రం..
చాలా ఎత్తుతో నిర్మించిన పూరీ జగన్నాథ ఆలయం గోపురంపై ఏర్పాటు చేసిన సుదర్శన చక్రాన్ని పూరీలో ఏప్రాంతం నుంచైనా చూడొచ్చు.ఎవరు ఎటు వైపు నుంచి చూస్తే సుదర్శన చక్రం వారి వైపే తిరిగినట్లు కనిపిస్తుంది.అది ఆ చక్రం ప్రత్యేకత..

గోపురంపై చక్రం..


ఎగరని పక్షులు..
పూరీ జగన్నాథ ఆలయం గోపురం పైకానీ చుట్టుపక్కల కానీ పక్షులు కనిపించకపోవడం దేవాలయం మరో రహస్యం.
పూరీ జగన్నాథ ఆలయంపై పక్షులు ఎగరవు. ఆలయంపైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు..అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతుపట్టని రహస్యం. ఎంతో మంది పరిశోధకలు దీనిపై అధ్యయనం చేసినా ఈ రహస్యాన్ని చేధించలేకపోయారు..

ఎగరని పక్షులు..


కనిపించని నీడ..
పూరీ జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా..సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపంచదు. దీని నిర్మాణం అలా ఉంటుందా లేదా దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కని రహస్యమే..

కనిపించని నీడ..


సముద్రపు గాలి..
సాధారణంగా పగటి వేళ సముద్రం నుంచి భూమివైపునకు వీచే గాలులు రాత్రి సమయాల్లో భూమి వైపు నుంచి సముద్రం వైపు వీస్తాయి.కానీ ఇక్కడ మాత్రం గాలుల దిశ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది.పగటి వేళ భూమి నుంచి సముద్రం వైపునకు రాత్రి వేళ సముద్రం నుంచి భూమి వైపునకు గాలులు వీస్తాయి..

వ్యతిరేక దిశలో సముద్రం గాలి..


ప్రసాదం ప్రత్యేకం..
పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం భారీస్థాయిలో ప్రసాదం తయారు చేస్తుంటారు.అయితే ప్రసాదం తయారు చేసే సమయంలో ప్రసాదం నుంచి ఎటువంటి వాసనలు రావట.కానీ జగన్నాథుడికి ప్రసాదం నివేదించాక ప్రసాదం నుంచి సువాసనలు వెలువడతాయట.మరో విశేషం ఏంటంటే పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారుచేసిన ప్రసాదాన్ని 20 లక్షల మందికి పెట్టవచ్చట.ఏమాత్రం వృథా కాకుండా మొత్తం ఖాళీ అవుతుందట.పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు. ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. ఆతరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా, అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు ఘుమఘుమలాడుతాయి..

ప్రసాదం..


మట్టికుండల్లో ప్రసాదం..


తనంతట తానే ఆగిపోయే రథం..
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే..గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే..రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు.ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది..

రథం తనంతట తానే ఆగిపోయే గుండిచా గుడి..


సముద్రం నిశ్శబ్దం..
బంగాళఖాతం సముద్రతీరంలో కొలువై ఉన్న జగన్నాథుడి ఆలయంలోకి సింహద్వారం నుంచి ప్రవేశించక ముందు వినిపించే సముద్రపు అలల ఘోష గుడిలోకి అడుగుపెట్టగానే సముద్ర అలల ఘోష ఏమాత్రం వినిపించదట.సింహద్వారం నుంచి అడుగు బయట పెట్టగానే మళ్లీ వెంటనే సముద్రపు అలల ఘోష వినిపిస్తుందట.ఇది కూడా ఇప్పటివరకు అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది..

సముద్రపు అలల ఘోష..

ఇన్న వింతలు,విశేషాలు,రహస్యాలు ఉన్న పూరీ జగన్నాథుడి ఆలయాన్ని ఒక్కసారైనా సందర్శించుకోవాలంటే పూరీకి వెళ్లాల్సిందే.పూరీకి చేరుకోవాలంటే దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.భువనేశ్వర్ నుంచి కూడా బస్సు,ప్రైవేటు వాహనాల ద్వారా పూరీకి చేరుకోవచ్చు.భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.భువనేశ్వర్లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos