ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గుత్తా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గుత్తా..

 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనమండలి స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో మూడు తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో కోలగట్ట వీరభద్రస్వామి,ఆళ్లనాని,కరణం బలరాంలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆగస్టు 7 నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల దాఖలుకు నెల 14 వరకు గడువు విధించారు. నెల 16 నామినేషన్ల పరిశీలిన, ఆగస్టు 19 నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఆగస్టు 26 పోలింగ్ జరిపి.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డిని అభ్యర్థిగా తెరాస అధినేత కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు.ఎమ్మెల్సీ కోసమే గత ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో,ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం గుత్తా టికెట్‌ కోసం ప్రయత్నించలేదు.ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా పేరును ఖరారు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీపుకోవడంతో గుత్తాలో సంతోషం వెల్లివిరిసింది.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos