కోర్టుకు హాజరైతే తప్పేంటి?

కోర్టుకు హాజరైతే తప్పేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టులో విచారణకు హాజరవడంలో తప్పేముందంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేయడంతో ప్రతిపక్షాల నేతలు వైఎస్ జగన్పై విమర్శలు ఎక్కుపెట్టారు.ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైతే తప్పేంటంటూ నాని వ్యాఖ్యలు చేశారు. ‘‘కోర్టులు చట్టవ్యతిరేక జూదశాలలు కాదుకదా! ఎవరైనా వెళ్లొచ్చు. చంద్రబాబు, సోనియా గాంధీ, జనసేన ముఖ్యులు కలిసి అక్రమంగా సీఎం జగన్పై కేసులు పెట్టారు. సీబీఐ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు… సీఎం కోర్టుకు హాజరయ్యే విషయంలో ఖర్చుతో సమస్య లేదని.. ముఖ్యమంత్రిగా ఆయన కీలకమైన సమయం వృథా అవుతుందని నాని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos