చైనా పై పోరుకు భారత్ కు అమెరికా అండ

చైనా పై పోరుకు భారత్ కు అమెరికా అండ

వాషింగ్టన్: చైనా ముప్పును ఎదుర్కొనేందుకు భారత్తోపాటు ఆసియా దేశాలకు అండగా తమ సైనాన్ని పంపించే అవకాశాలను పరిశీలిస్తు న్నామని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలకు చైనా నుండి ముప్పు పొంచి ఉందని చెప్పారు. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన వనరులను సిద్దం చేస్తామని బ్రస్సెల్స్ వేదిక నుద్దేశించి చేసిన వీడియో సమావేశంలో వ్యాఖ్యానించారు. జర్మనీలో అమెరికా బలగాలను 52 నుంచి 25 వేలకు తగ్గిస్తున్నందున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచన ప్రకారం సైనికల బలగాల సమీక్ష చేస్తామన్నారు. ఏ ప్రాంతానికైనా ముప్పు వాటిల్లితే వాటిని రక్షించటం ఇతర దేశాల బాధ్యత అన్నారు. భారత్, చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటున్న దశలో పాంపియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos