ఉత్తరాంధ్రలో మాంగనీసు చిచ్చు

ఉత్తరాంధ్రలో మాంగనీసు చిచ్చు

విజయనగరం: ఉత్తరాంధ్రలోని పచ్చని పల్లెల్లో మాంగనీసు చిచ్చు రేపుతోంది. విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఖనిజాన్ని వెలికితీయడానికి కేంద్రం రహస్య సన్నాహాల్ని చేపట్టింది. మొత్తం 14 బ్లాకుల్లోని ఖనిజ నమూనాలు సమీకరించారు. తవ్వకాలకు త్వరలోనే అంతర్జాతీయ టెండర్లు పిలవనున్నారు. రెండు, మూడు బహుళ జాతి సంస్థలకు ఈ గనులపై కన్నుపడింది. వాటి సూచనల మేరకు కొన్ని బ్లాకుల్లో రీ సర్వే జరగనుందని ఉన్నత అధికారులు ధ్రువీకరించారు. మాంగనీసు తవ్వకాలకు రెండేళ్లుగా సాగుతున్న ప్రయత్నాల్ని స్థానికులు అనేక విధాలుగా అడ్డుకున్నారు. గత నెల 28న నెల్లిమర్ల మండలం గరికిపేట కొండపై మాంగనీసు గ్రేడింగ్ సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. విజయనగరం జిల్లాలో 1,113 ఎకరాల్లో మాంగనీసు, ఒక చోట ఇనుస ఖనిజాల్ని గుర్తించారు. మాంగనీలు తవ్వకాల వల్ల జిల్లాలు అభివృద్ధి చెందుతాయని గనుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వి రమణారావు అన్నారు. దాని దుష్ఫలితాల గురించి మాత్రం నోరు మెదప లేదు. మాంగనీసు తవ్వకాలు జరిగే ప్రాంతాల్లోని వారికి నాడీ సమస్యలు తలెత్తుతాయి. పశువులపైనా దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. అధికార యంత్రాంగం ఈ దుష్ప రిణామాల గురించి ప్రజల్లో ప్రచారం చేయలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos