పేదరిక నిర్మూలనలో పాక్‌ కంటే అథమంగా…

పేదరిక నిర్మూలనలో పాక్‌ కంటే అథమంగా…

ఢిల్లీ : భారత దేశం పేదరిక నిర్మూలనలో బాగా వెనుకబడింది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల కన్నా అథమ స్థితిలో ఉంది. 117 దేశాల సమాచారంతో రూపొందించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 102వ స్థానంలో ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2015లో 93వ స్థానంలో ఉన్న భారత దేశం తాజాగా 102వ స్థానానికి దిగజారింది. దక్షిణాసియా దేశాల్లో భారత దేశం మినహా మిగిలిన దేశాలు 66 నుంచి 94 వరకు ర్యాంకులు సాధించాయి. బ్రిక్స్ దేశాల కన్నా దయనీయ పరిస్థితులు భారత దేశంలో కనిపించాయి. బ్రిక్స్ దేశాల్లో అతి తక్కువ ర్యాంకు దక్షిణాఫ్రికా (59)కి వచ్చింది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలను బ్రిక్స్ దేశాలంటారు. ఎప్పుడూ వెనుకబడి ఉండే పాకిస్థాన్ సైతం తాజా ర్యాంకింగ్స్‌లో 94వ స్థానాన్ని దక్కించుకుంది. బంగ్లాదేశ్ 88వ ర్యాంక్ సాధించింది. 2014 నుంచి 2018 వరకు 117 దేశాల సమాచారాన్ని అధ్యయనం చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను రూపొందించారు. ఒక దేశంలో పోషకాహార లోపంతో బాధపడే బాలల సంఖ్య, ఎత్తుకు తగిన బరువు లేనటువంటి ఐదేళ్ళ లోపు బాలల సంఖ్య, వయసుకు తగిన ఎత్తు లేనటువంటి బాలల సంఖ్య, ఐదేళ్ళ లోపు బాలల మరణాల రేటు ఆధారంగా ఈ సూచీని రూపొందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos