హనుమాన్ దేవాలయానికి లౌడ్‌స్పీకర్ ఇచ్చిన ముస్లింలు

హనుమాన్ దేవాలయానికి లౌడ్‌స్పీకర్ ఇచ్చిన ముస్లింలు

కొల్హాపూర్ : మహారాష్ట్రలోని శాంగ్లి పట్టణంలో ఓ హనుమాన్ దేవాలయానికి కొందరు ముస్లింలు లౌడ్స్పీకర్ను బహుమతిగా ఇచ్చారు. ‘స్థానిక ముస్లింలు ఈ దేవాల యానికి చాలా కాలం నుంచి సేవ చేస్తున్నారు. గతంలో వీరు నాటిన మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్ద అయ్యాయి. రాజకీయ నేతలు మతాన్ని తమకు అనుకూలంగా మలచుకోకుండా చూడటం కోసం అయూబ్ పఠాన్ ముస్లిం యువ పరిషత్తును ఏర్పాటు చేశారు. హనుమాన్ దేవాలయంలో లౌడ్స్పీకర్ లేదని తెలుసుకుని, స్థానిక ముస్లింలతో కలిసి, దానిని బహుమతిగా ఇచ్చారు’ అని ఆలయ ప్రతినిధులు తెలిపారు. తాము చిన్నప్పటి నుంచి ఈ దేవాలయంలోని ప్రార్థనలను వింటూ జీవిస్తు న్నా మని అయూబ్ చెప్పారు. హిందువులు కూడా తాము వినిపించే అజాన్ను ఇష్టపడతారన్నారు. లౌడ్స్పీకర్ల నుంచి వినిపించే శబ్దం పరిమిత స్థాయిలో ఉన్నపుడు అభ్యం తరం చెప్పకూడదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos