పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా

పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయ దుందిభి మోగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ఫలితారు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారుల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు 1390 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 345 స్థానాల్లో విజేతలుగా నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 200లకు పైగా స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. సీపీఎం 10, సీపీఐ 7, బీజేపీ 29, టీడీపీ 8స్థానాల్లో గెలుపొందాయి. ఓట్ల లెక్కింపు తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది. మెజార్టీ సభ్యులు ఎవరికి మద్దతు ఇస్తారో వారికే ఉప సర్పంచ్ పదవి వరిస్తుంది. ఎన్నికల కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు 26 వేల మంది పోలీసులను వినియోగించారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎన్నికలు ముగిశాయి. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 25, మూడో విడుత ఎన్నికలు 30న జరుగనున్నాయి. తెలంగాణలో తొలి విడత ఎన్నికలు జరగబోయే 3,701 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవులకుగాను 12,202 మంది పోటీలో ఉండగా.. 28,976 వార్డు సభ్యుల పదవులకుగాను 70,097 మంది బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. తొలుత వార్డులు సభ్యుల అభ్యర్థులకు, తర్వాత సర్పంచ్‌ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నికను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos