మద్య నిషేధం సామాజిక బాధ్యత

మద్య నిషేధం సామాజిక బాధ్యత

హైదరాబాద్: సామాజిక బాధ్యతగా మద్యాన్ని నిషేదించాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ గురువారం ఇక్కడ డిమాం డు చేసారు. హైదరాబాద్ బ్రాండ్ ను పాలకులు బ్రాందీ హైదరాబాద్గా మార్చారని ఎద్దేవా చేశారు. మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు వద్ద మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించిన తర్వాత ప్రసంగించారు. భా జ పా మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. భవిష్యత్లో ఏ తల్లి కడుపు కోతకు మద్యం కారణం కాకూడదని ఆశించారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారనిమండి పడ్డారు. మద్యం నియంత్రణ శాఖను. మద్యం పెంచే శాఖగా మార్చారు. దరఖాస్తుల ద్వారానే రూ.980 కోట్లు సంపాదించింది. ప్రభుత్వానికి మద్యం ద్వారానే రూ.20 వేల కోట్ల ఆదా యం లభించింది. హైదరాబాద్లో క్లబ్, పబ్ కల్చర్ తీసుకొచ్చారు. ఇది మన సంస్కృతి కాదు. మద్యం తల్లిదండ్రుల పాలిట గుది బండగా మారింది. యువత క్లబ్, పబ్ కల్చర్కు బానిసై జీవితాలను కోల్పోతున్నారు’ అని లక్ష్మణ్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos