ఎల్జీ పాలిమర్స్కు బాబు సర్కారే అనుమతిచ్చింది

తాడేపల్లి : ‘ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వమే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం ఇక్కడి నుంచి విశాఖ జిల్లా అధికారులతో న్ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. ‘ఈ ప్రభుత్వం స్పందించినంత వేగంగా బహుశా ఎక్కడా ఏ ప్రభుత్వమూ స్పందించి ఉండదు. బాధితులకు రూ.కోటి పరిహారం ప్రకటించడం దేశంలో ఎక్కడా లేదు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేశాం. జిల్లా స్థాయిలో కూడా ఓ కమిటీ వేశాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో మూడు కమిటీలు వచ్చి పరిశీలించాయి. యుద్ధప్రాతిపదికన కమిటీలు వేయడమే కాకుండా.. ఎప్పటికప్పుడు నివేదికలు పరిశీలించాం. కంపెనీని ప్రశ్నించాల్సిన అంశాలన్నీ తయారు చేసి వారం సమయం ఇస్తాం. కంపెనీ నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకుని కమిటీలు ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. బాధితులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచించామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos