వైరస్ ను తట్టుకునే ఒకే ఒక జంతువు..

వైరస్ ను తట్టుకునే ఒకే ఒక జంతువు..

మనవాళిపై పగబట్టిన కరోనా వైరస్ కు వాక్సిన్ కనిపెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ నిర్విరామంగా ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే భారత్ సహా చాల దేశాలు వాక్సిన్ సిద్ధం చేసిన అవి ఏ మేరకు ఫలితాలు ఇష్టతాయోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తరుణంలో లామా అనే జంతువులో వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ భారీగా ఉన్నాయని గుర్తించారు.చూడ్డానికి ఓ చిన్న సైజు ఒంటెలా.. కంగారూలా కనిపిస్తుంటుంది. ఈ జంతువు దక్షిణ అమెరికా దేశాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. పెరూ కొలంబియాల్లో కూడా ఉంటాయి. డొమెస్టిక్ యానిమల్ గుర్తింపు ఉన్న ఈ లామా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఈ పరిశోధనలతో పరిశోధకుల దృష్టి ఆ జంతువుపై పడింది. భయానక వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన విరుగుడు ఈ జీవిలో ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరే జంతువులోనూ లేని విధంగా లామాలో విభిన్నమైన జీవకణాల నిర్మాణం ఉందని దాని ద్వారా వైరస్కు విరుగుడును కనిపెట్టవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.వైరస్ దాడి చేస్తే సమర్థవంతంగా ఎదుర్కొనే సహజసిద్ధ జీవకణాలు లక్షణాలు ఆ జంతువు లామాలో మాత్రమే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ తరహా జీవకణాల నిర్మాణం మరే ఇతర జంతువుల్లో లేదని తేలింది. వైరస్ సోకిన సమయంలో లామా సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ తరహా సూక్ష్మ జీవకణాలను నానోబాడీస్గా గుర్తించారు. లామా రక్తకణాలను సేకరించి దానిపై నిర్వహించిన పరిశోధనల సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మహమ్మారి వంటి వైరస్ను నిర్మూలించగలిగే సామర్థ్యం వాటికి ఉందని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos