కేసీఆర్‌కు కొత్త టార్చర్..

కేసీఆర్‌కు కొత్త టార్చర్..

ఇన్ని రోజులు తనకంటే గొప్ప నాయకుడు ఎవరూ లేరంటూ కొంత గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన తెరాస అధినేత కేసీఆర్‌కు కొద్ది రోజులుగా కొత్త టార్చర్‌ మొదలైంది.దేశంలో తన పరిపాలనే ఉత్తమమని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు తెలంగాణలోని పలు పార్టీల నేతలు టార్చర్‌ చూపిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను చూసి పారదర్శక,అవినీతి నిర్మూల పాలన ఎలా చేయాలో చూసి నేర్చుకోవాలంటూ కేసీఆర్‌కు హితబోధ చేయడం మొదలుపెట్టారు.మంత్రివర్గంలో అన్ని కులాలు,మతాలకు సమాన ప్రాధాన్యత కల్పించారని మహిళలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారని జగన్‌ను చూసి కేసీఆర్‌ నేర్చుకోవాలంటూ హితబోధ చేస్తూ కొత్త టార్చర్‌ మొదలుపెట్టారు.నిన్నమొన్నటి వరకు కేసీఆర్‌ పాలన బెస్ట్‌ అంటూ కితాబులిచ్చిన మందకృష్ణ మాదిగ కూడా జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితువు పలికారు.తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి కూడా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాల పాలన చూసి కేసీఆర్‌ సిగ్గుపడాలంటూ మండిపడ్డారు.పథకాల అమలు,పారదర్శక,అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్న జగన్‌ను చూసి కేసీఆర్‌ కళ్లు తెరవాలంటూ విమర్శించారు.ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రెండు డీఎస్సీలు పూర్తి చేసినా కేసీఆర్‌ సర్కార్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా పూర్తి చేయలేదంటూ మండిపడ్డారు.దేశంలో తమ పథకాలే గొప్పవంటూ ప్రగల్బాలు పలుకుతున్న కేసీఆర్‌ పథకాలు అంటే ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలంటూ విమర్శించారు.రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ మహిళ నేత విజయశాంతి కూడా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి కేసీఆర్‌ బుద్ధి తెచ్చుకోవాలంటూ హితవు పలికిన విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos