కేజ్రీవాల్‌ ను అవమానించిన కేంద్రం

కేజ్రీవాల్‌ ను అవమానించిన  కేంద్రం

న్యూ ఢిల్లీ:అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఇక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను దూరంగా నిట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపారు.మెలానియా మంగళ వారం దక్షిణ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో జిరిగే హ్యాపీనెస్ క్లాస్ను చూసిన తర్వాత పాటు అక్కడి చిన్నారులతో మాటా మంతీ సాగించనున్నారు. తొలి ప్రణా ళిక ప్రకారం మెలానియాకు కేజ్రీవాల్, సిసోడియా ఆహ్వానాన్ని పలకాల్సి ఉంది.విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మనీశ్ సిసోడియా రెండేళ్ల కిందట ‘హ్యాపీనెస్ పాఠ్యాంశాన్ని ప్రవేశ పెట్టారు.ప్రతి రోజు 40 నిమిషాల పాటు ధ్యానం, విశ్రాంతితో పాటు ఆట పాటల్ని నిర్వ హించ టం దీని ప్రత్యేకత. తన నియోజకవర్గంలోని ఉన్న పాఠశాలను సందర్శించేందుకు మెలానియా ట్రంప్ ఆసక్తిగా ఉన్నారని అమెరికా రాయబార కార్యా ల యం నుంచి వినతి వచ్చిందని మనీశ్ తెలిపారు.మెలానియా వస్తారంటే ఆహ్వానిస్తామని చెప్పారు. ట్రంప్ పర్యటనలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలను చేర్చడమే ఆసక్తికరం. ఆప్ సర్కారు ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోలేదని భాజపా ఆరోపించి పలు వీడియోలు పోస్టు చేసింది. దాన్ని ఆప్ సర్కారు తిప్పికొట్టింది. స్కూళ్లు బాగా లేవన్న భాజపాయే ఇప్పుడు మెలనియా ట్రంప్కు ఆ స్కూళ్ల గొప్పదనాన్ని చూపాలని నిర్ణయించిందని ఆప్ నేతలు హేళన చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos