ప్రకృతి అందాల నిలయం కావేరి నిసర్గ ధామం..

  • In Tourism
  • September 9, 2019
  • 265 Views
ప్రకృతి అందాల నిలయం కావేరి నిసర్గ ధామం..

దక్షిణ భారతదేశంలోని ప్రముఖ హిల్స్‌ స్టేషన్‌లలో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది.స్కాట్లాండ్ ఆఫ్ ఇండియాగా కూర్గ్‌లో దట్టమైన అడవులు, జలపాతాలు,పచ్చటి పశ్చిమ కనుమలు,వందల ఎకరాల్లో పచ్చటి చీర కట్టుకున్నట్లు ఉండే కాఫీతోటలు,ఘుమఘుమలాడే సుగంధ ద్రవ్యాల తోటలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి అందాల జాబితా అంతే ఉండదు.నడివేసవిలో సైతం కూర్గ్‌లో 25 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదు కాకపోవడం ఇక్కడి ప్రత్యేకత.అందుకే దేశవిదేశాల నుంచి సైతం పర్యాటకులు కూర్గ్‌కు క్యూ కడుతుంటారు.కూర్గ్‌లో చూడదగిన ప్రదేశాలకు కొదవే లేదు.కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల పాలిట జీవనదిగా పేరుగాంచిన కావేరి నది ఉగమస్థానమైన తలకావేరితో పాటు ప్రకృతి అందాలు,జలపాతాలు,వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్న కావేకి నిసర్గధామ ఇక్కడ ప్రత్యేకంగా చూడదగిన పర్యాటక ప్రాంతం.ప్రకృతి రమణీయతనంతా ఒకే చోట పోతపోసినట్లు ఉన్న ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారెైనా దర్శించాల్సిందే.కావేరీ జలాల మధ్య ఏర్పడిన ఈ దీవిలో వెదురు, చందనపు చెట్ల అందాలు వర్ణించతరం కాదు. కుందేళ్ల పార్క్, లేళ్ల పార్క్, నెమళ్ల పార్కులు ఈ దీవిలో తప్పక చూడాల్సిన ప్రత్యేకతలు. ఏనుగు స్వారీ, బోట్ రైడ్స్ వంటి అదనపు ఆకర్షణలూ ఉన్నాయి.పశ్చిమకనుమల్లోని కొండల పైనుంచి వయ్యారంగా కిందకు దూకే జలపాతాలు అడుగడుగునా పలకిస్తూ పులకరిస్తుంటాయి. మార్గం పొడవునా అనేక కాఫీ లేదా సుగంధపు ద్రవ్యాల తోటలు చూస్తూ ప్రయాణం చేయవచ్చు.మార్గంలో చెంగు చెంగున దూకుతూ కనిపించే కుందేళ్లు కుందేళ్ళు చెక్క వంతెనలు, చెక్క రహదారుల మధ్య ఎలిఫెంట్ సఫారీ పర్యాటలకును అమితంగా ఆకర్షిస్తుంది.కావేరీ నిసర్గ ధామ లో జింకల పార్క్ ప్రధాన ఆకర్షణ. అందమైన జింక పిల్లలకు ఆహారాన్ని అందివ్వడానికి పర్యాటకులు ఎక్కువగా ఉత్సహాం చూపిస్తూ ఆనందిస్తుంటారు.వెదురు పొదల్లో నడుచుకుంటూ వచ్చే పర్యాటకలు అక్కడక్కడ సేద తీరడానికి ఏర్పాటు చేసిన వెదురు శిబిరాల్లో ఎంతసేపు సేద తీరినా చాలదనిపిస్తుంది.రాత్రుల్లో ఎవరైన అక్కడే బస చేయాలని కోరుకునే వారి కోసం ఉడెన్ కాటేజ్ లు అందుబాటులో ఉన్నాయి. నది పక్కన ఉడెన్ కాటేజ్ బాల్కనీ నుండి చూడటం చాలా అద్భుతంగా..ఉల్లాసంగా ఉంటుంది.పర్యాటలకు ప్రస్తుతం ఉన్న కొత్త బ్రిడ్జ్ నుండి పాత బ్రిడ్జ్ ను తిలకించవచ్చు.దీంతోపాటు టిబేటియన్ గోల్డన్ టెంపుల్, ఓంకారేశ్వర దేవస్థానాలు చూడదగిన ప్రదేశాలు.ఈ దేవస్థానాలను దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి హిందూ,బౌద్ధ మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.హారంగి డ్యాం,దుబారే ఎలిఫెంట్ క్యాంప్, అబ్బి జలపాతం, ఇర్ఫు జలపాతం, మళ్లళ్లి జలపాతం ఇలా ఎన్నో జలపాతాలను ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు.అదే విధంగా మడికేరి కోట, నాల్కోనాడ్ ప్యాలెస్ వంటివి కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.మడికేరి పట్టణ చరిత్ర పరిశీలిస్తే..
ముద్దురాజాకెరీ లేదా ముద్దురాజా అనే రాజు పేరుతో ఈ పట్టణానికి మడికేరిగా నామకరణం చేసినట్లు స్థానిక చరత్ర ద్వారా తెలుస్తోంది.హలేరీ వంశానికి చెందిన ముద్దురాజా కొడగును 1633 నుంచి 1687 వరకూ పాలించాడు. అతని పేరు మీద ఏర్పడిన పట్టణమిది.ఆ రాజావారి కోట ఇప్పటికీ అక్కడ ఉంది. ఈ పట్టణానికి శివారులో ఉండే ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ‘రాజాస్ సీట్’ అంటారు. నాలుగు స్తంభాల ఆధారంగా, ఓ చరియ మీద అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ నిర్మాణం ప్రముఖ సందర్శనీయ స్థలం. ఇక్కడ్నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి అందరూ క్యూ కడతారు.

నిసర్గధామలో జలపాతం..


కావేరి నదిలో బోటింగ్‌..


వెదురు వంతెన


నిసర్గధామలో లేళ్లు..


కుందేళ్లు..


వెదురు శిబిరం


ప్రకృతిని చూస్తూ వెదురు శిబిరంలో సేద తీరుతున్న యువతులు..


కావేరి నది..


పచ్చదనం కప్పుకున్న కూర్గ్‌లో ఓ ప్రాంతం..


దట్టమైన అడవి మధ్య హోంస్టే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos