రష్యా అమ్మాయి..కరీంనగర్‌ అబ్బాయి..

రష్యా అమ్మాయి..కరీంనగర్‌ అబ్బాయి..

కరీంనగర్కు చెందిన యువకుడు రష్యాకు చెందిన యువతిని పెళ్లాడాడు. కరీంనగర్ శివారులో నిన్న జరిగిన వివాహం సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. పట్టణానికి చెందిన సందీప్ కుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ తన కాలేజీలోనే చదువుకుంటున్న రష్యాకు చెందిన వెరోనికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారు కూడా అంగీకరించడంతో ఆదివారం వీరి వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహానికి వధువు తరపున వెరోనిక తల్లి హాజరైంది. ఘనంగా జరిగిన వివాహానికి పలువురు పెద్దలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos