వరుస హత్యలు.. ఖాకీలకు సవాల్‌

వరుస హత్యలు.. ఖాకీలకు సవాల్‌

కోజికోడ్: సైనైడ్ సీరియల్ కిల్లర్ జాలీ జోసెఫ్ కేసు సవాలని పోలీస్ డైరెక్టర్ జనరల్ లోక్నాథ్ బెహ్రా శనివారం ఇక్కడ విలేఖరులతో వ్యాఖ్యానించారు. ఈ కేసులో మొదటి-చివరి హత్యల మధ్య వ్యవధి 14 ఏళ్ల ఉన్నందున ఆధారాల సమీకరణ క్లిష్టంగా ఉందన్నారు. నిందితురాలు జాలీని తానూ కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒకే కుటుంబంలో జరిగిన వరుస హత్యల దర్యాప్తు బృందంతో సుదీర్ఘ సమావేశాలు జరిపిన తర్వాత బెహ్రా విలేఖరులతో మాట్లాడారు. ‘ఇది అత్యంత సవాలుతో కూడుకున్న కేసు. చాలా ముఖ్యమైనందునే నేను ఇక్కడికి వచ్చాను. ఆరు హత్యలు జరిగాయి . మొత్తం ఆరు కేసుల్ని విడి విడిగా విచారించాల్సి ఉంటుంది. తొలి హత్య 17 ఏళ్ల కిందట జరగ్గా చివరి హత్య మూడేళ్ల కిందట సంభవించింది. ఆధారాలు సేకరించడం అత్యంత క్లిష్టం. ఇదే పెద్ద సవాల’ని పేర్కొన్నారు. నిఘూగూడంగా మారిన ఈ హత్యలన్నీ నివృత ప్రభుత్వ ఉద్యోగి టామ్ థామస్ కుటుంబంలో జరిగాయి. మొత్తం ఆరు మృత దేహాలను మళ్లీ వెలికి తీసి నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.హ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos