ఇరాన్ పై దాడికి అమెరికా పన్నాగం

ఇరాన్ పై దాడికి అమెరికా పన్నాగం

వాషింగ్టన్: ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రం నటాంజ్పై దాడి చేయాలని ట్రంప్ వారం రోజుల కిందట ప్రణాళిక వేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. సలహాదారుల సూచనల మేరకు ఆ వ్యూహాన్ని ఉపసంహరించినట్లు వివరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ మంత్రి క్రిస్టోఫర్ మిల్లర్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లేతో కలిసి ట్రంప్ ఇటీవల సమావేశమయ్యారు. దాడి చేస్తే ఇరాన్తో అమెరికాకు నెలకొన్న సమస్య మరింత పెరుగుతుందని ట్రంప్కు సలహాదారులు చెప్పారు. దీంతో దాడి ఆలోచనను ట్రంప్ విరమించుకున్నారు. ఇరాన్ తో న్యూక్లియర్ ఒప్పందం నుంచి తప్పుకున్నపుడు ట్రంప్ ఇరాన్ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఆ దేశంపై ఆంక్షల్ని విధించారు. యురేనియం ఎన్రిచ్మెంట్ సైట్ నుంచి అండర్గ్రౌండ్ సైట్లోకి అడ్వాన్స్డ్ సెంట్రిప్యూజ్లను తీసుకువెళ్లేందుకు ఇరాన్ ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలియడంతో అణు కేంద్రంపై దాడి చేయాలని ఇటీవల ట్రంప్ భావించారు. ఇరాన్ వద్ద 2.4 టన్నుల శుద్దీకరించిన యురేనియం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos