హోసూరులో రాగి పంటకు నష్టం

హోసూరులో రాగి పంటకు నష్టం

హోసూరు : తుపాను ప్రభావంతో హోసూరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రాగి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. హోసూరు ప్రాంతంలో మెట్ట పంటగా రాగి ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడూ హోసూరు ప్రాంతంలో 30 వేల హెక్టార్లలో రాగి పంటను సాగు చేశారు. సకాలంలో వర్షాలు బాగా కురవడంతో రాగి పంట అమోఘంగా పండింది. ప్రస్తుతం కోత దశకు చేరుకున్న రాగి పంట తుపాను కారణంగా నేల పాలైంది. కోత దశలో ఉండగా గత 15 రోజులుగా స్వల్పంగా కురుస్తున్న వర్షాల వల్ల రాగి పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని హోసూరు ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos