హెచ్ఏఎల్‌కు 65వేల కోట్ల టెండ‌ర్ జారీ చేసిన ర‌క్ష‌ణ‌శాఖ‌

హెచ్ఏఎల్‌కు 65వేల కోట్ల టెండ‌ర్ జారీ చేసిన ర‌క్ష‌ణ‌శాఖ‌

న్యూ ఢిల్లీ : హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు రక్షణశాఖ భారీ టెండర్ను జారీ చేసింది. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదు కోసం .. దాదాపు 65 వేల కోట్ల ఖరీదైన టెండర్ను ఇచ్చింది. ఇది స్వదేశీ మిలిటరీ హార్డ్వేర్ కోసం ఇచ్చిన భారీ ఆర్డర్ కానున్నది. కొన్ని రోజుల క్రితం రక్షణ శాఖ.. హెచ్ఏఎల్కు ఈ టెండర్ను జారీ చేసింది. దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు మూడు నెలల గడువు కూడా రక్షణ శాఖ ఇచ్చింది. ఒకవేళ హెచ్ఏఎల్ సంస్థ ఆ ఆఫర్ను స్వీకరిస్తే, అప్పుడు భారతీయ వైమానిక దళంలో ఉన్న మిగ్-21, మిగ్-23, మిగ్-27 విమానాలను మార్చే అవకాశం ఉంటుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ భారీ ఆర్డర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. హెచ్ఏఎల్ తయారు చేసిన ఫైటర్ విమానంలో ఇటీవల ప్రధాని మోదీ కూడా విహరించిన విషయం తెలిసిందే. సుమారు 97 ఎల్సీఏ మార్క్ 1ఏ ఫైటర్ విమానాల ఖరీదుకు చెందిన నిర్ణయాన్ని వైమానిక దళ చీఫ్ వీఆర్ చౌదరీ ప్రకటించారు. స్పెయిన్ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఆ ప్రకటన చేశారు. తేజస్ విమానానికి అడ్వాన్సడ్ వర్షనే ఎల్సీఏ మార్క్ 1ఏ విమానం. ఎల్సీఏ మార్క్ 1ఏ విమానంలో అడ్వాన్స్డ్ ఏవియోనిక్స్, రేడార్లు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos