ప్రైవేటు కు దీటుగా.. ప్రభుత్వ పాఠశాల ఫలితాలు

ప్రైవేటు కు దీటుగా.. ప్రభుత్వ పాఠశాల ఫలితాలు

కడప : పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రయివేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు వచ్చాయని మండల విద్యా శాఖ అధికారి హర్షించారు. 96 శాతం మంది ఉత్తీర్ణులు. దొమ్మరా నంద్యాల హై స్కూల్ కు చెందిన ఎంపి.రాఘవి, వేపరాల హై స్కూల్ విద్యార్థి బి.చంద్రజ్యోతి, బాలికల గురుకుల పాఠశాల విద్యారులు జి. గౌరేశ్వరి దేవి, ఆర్.లక్ష్మీదేవి లు పది గ్రేడు సాధించారన్నారు. చిన్నకొమెర్ల హై స్కూల్ విద్యార్థి ఎస్.కిరణ్ కుమార్ రెడ్డి 9.5 జిపి, మైలవరం హై స్కూల్ విద్యార్థులు జి.కఅపా, కె.త్రివేణి లు 9.5 గ జిపి, దొడియం హై స్కూలుకు చెందిన కె.హసీనా, ఎస్.హసీనా లు 9.3 జి.పి, వద్దిరాల హై స్కూల్ విద్యార్థి కె.దీవెన 9.3 జి.పి సాధించినట్లు వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఆ విజయానికి సహకరించిన వారి తల్లి దండ్రులు, ఉపాధ్యాయుల్ని మండల విద్యా శాఖ అధికారి అభినందించారు. కొండా పురం మండలం ప్రభుత్వ పాఠశాలల్లో 45 మంది విద్యార్థినీ , విద్యార్థులు 10/10 జిపిఎ సాధించారు. ఉప్పలూరు, రాజులగురు వాయపల్లె, కొర్రపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos