పసిడి జోరుకు బ్రేక్

  • In Money
  • January 8, 2020
  • 150 Views

హైదరాబాద్ : బంగారం ధర పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా నింగివైపునకు చూపులు చూస్తున్న పసిడి ధర ఈ రోజు పడిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు స్తబ్దుగా ఉండటం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగానే పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.530 దిగొచ్చింది. దీంతో పసిడి ధర రూ.38,430కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.530 తగ్గుదలతో రూ.41,980కు పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పడిపోయింది. దీంతో ధర రూ.50,750కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 పడిపోయింది. దీంతో ధర రూ.39,250కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గింది. దీంతో ధర రూ.40,440కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.250 తగ్గింది. దీంతో ధర రూ.50,750కు దిగొచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos