ఇవ్వని నీటికి బిల్లులా…డిఎంకే ధ్వజం

ఇవ్వని నీటికి బిల్లులా…డిఎంకే ధ్వజం

హోసూరు : యూనియన్లోని ముగళూరు పంచాయతీలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయని తాగునీటికి రూ.83 వేలు ఖర్చు చేసినట్లుగా తీర్మానంలో చూపడం సమంజసం కాదని డిఎంకె పార్టీ కౌన్సిలర్ సంపత్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో ధ్వజమెత్తారు. యూనియన్ చైర్ పర్సన్ శశి వెంకటస్వామి నేతృత్వంలో హోసూరు యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోసూరు యూనియన్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు, తదుపరి చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. యూనియన్లోని పలు గ్రామాలలో ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రామాలలో తగినంత వసతులు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని డిఎంకె పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిఎంకె పార్టీ కౌన్సిలర్ ముగళూరు సంపత్ కుమార్ మాట్లాడుతూ, ముగళూరు, వన్నపల్లి గ్రామాలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున తన సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేశానని, తీరా చూస్తే పంచాయతీ నిధుల ద్వారా నీరు సరఫరా చేసినట్లు రూ.83 వేలకు బిల్లు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ఆయన అన్నారు. ముగళూరు పంచాయతీలోని గ్రామాలలో తాగునీటి ఎద్దడిని వెంటనే నివారించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని, అదే విధంగా తన కౌన్సిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని సంపత్ కుమార్ సమావేశంలో డిమాండ్ చేశారు. కాగా సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు.ఈ సమావేశంలో వైస్ చైర్పర్సన్ నారాయణస్వామి, బిడిఓ రామచంద్రన్,ఆప్తాప్ బేగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos