శిల్పకళా నిలయం కుంభకోణం బృహదీశ్వర ఆలయం..

  • In Tourism
  • September 20, 2019
  • 335 Views
శిల్పకళా నిలయం కుంభకోణం బృహదీశ్వర ఆలయం..

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాష్ట్రంలో సనాతన భారతీయ సంస్కృతి,సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎన్నోఇతిహాస,చారిత్రాత్మక ఘట్టాలకు సైతం తమిళనాడు వేదికగా నిలిచింది.ఇక ఆధ్యాత్మిక,ధార్మిక క్షేత్రాల విషయంలో దేశంలోనే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ రాష్ట్రంలో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు.చోళరాజుల నిర్మాణాల్లో బృహదీశ్వర ఆలయం, తంజావూరు,గంగైకొండ చోళపురం వంటి అనే దేవాలయాలు ప్రపంచ ఖ్యాతి గడించాయి.పురావస్తు శాఖ నిర్వహణలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం  ఐరావతేశ్వర స్వామి దేవాలయం కూడా ఇదే కోవకు చెందుతుంది.12వ శతాబ్దంలో చోళులు ఇక్కడ ఐరాతేశ్వరుడిగా కొలువై ఉన్నశివుడి కోసం నిర్మించిన దేవాలయాల్లో ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో దారాసురంలోని ఐరావతేశ్వరాలయం కూడా ఒకటి.

ఐరావతేశ్వర దేవాలయం..

కుంభకోణం-తంజావూరు మార్గంలో కుంభకోణం పట్టణం నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న ఐరాతేశ్వర దేవాలయం శిల్పకళ అనేక అద్భుత శిల్పకళతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆలయం ద్రావిడ నిర్మాణ శైలి ఉపయోగించి నిర్మించబడింది.యలిస్ అనే పౌరాణిక జీవులు ఆలయ స్తంభాలు పైన చెక్కబడి ఉంటాయి.ఏనుగు  తొండం, ఎద్దు శరీరం, సింహం తల, పొట్టేలు కొమ్ములు,పంది  చెవులతో యలిస్‌ రూపం ఉంటుంది.

యలిస్‌..

గణనాథుడి ప్రతిమ..

రాళ్లతో చెక్కిన రథ చక్రాలను లాగుతున్నట్లుగా ఉండే ఏనుగులను, అశ్వాలను మలిచిన తీరు అప్పటి శిల్పుల నైపుణ్యత,ప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.సుమారు 80 అడుగుల ఎత్తుతో ఠీవీగా కనిపించే ఆలయ గోపురం మండప స్థంభాల పైన చెక్కిన శివకళ్యాణ దృశ్యాలు, శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.లయకారుడిని పెళ్లి కొడుకును చేయడం అందంగా ముస్తాబైన శివుడిని మహిళలు మైమరచిపోయి చూస్తుండటం, మేళతాళాలు,రథాలు, గుర్రాలు,ఏనుగుల ఊరేగింపు ఇలా శిల్పులు చెక్కిన ప్రతీది వర్ణణాతీతంగా ఉంటాయి.

లయకారుడు..

రథాన్ని లాగుతున్న ఏనుగులు,అశ్వాలు..

రథాన్ని లాగుతున్న అశ్వాలు,గజరాజులు..

అదే విధంగా త్రిపురాంతక సంహార దృశ్యాలు, త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యం, యోగ ముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్ధించడం ఇవన్నీ ఎంతో నేర్పుతో మలిచారు. సూక్ష్మ శిల్పాలలో చాలా భాగం భరత నాట్య అంశాలతో చెక్కినవి కావడం విశేషం. నాట్యకళకు చెందిన భంగిమలను మనోహరంగా చెక్కారు.గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో పూజలందుకుంటున్న శ్రీ ఐరావతేశ్వర దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియ(దేవ)నాయకి గర్భాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు శంఖ నిధి, పద్మనిధి శిల్పాలు నల్ల రాతి మీద చెక్కబడ్డాయి.

గర్భగుడి..

 

పెద్ద లింగ రూపంలో పూజలందుకుంటున్న శ్రీ ఐరావతేశ్వర స్వామి..

ఆలయ ప్రాంగణంలో మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ కుడ్య చిత్రాలనూ ఆసాంతం తిలకించవచ్చు.అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోకతప్పదు.ఐరాతేశ్వర దేవాలయంలో స్వరాలు పలికే శిల్పాలు మరో అద్భుతం.ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపజేసే రాతి మెట్లు ఉన్నాయి.శిల్పాలు,రాతిమెట్ల నుంచి సంగీతం ఎలా వస్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిలిగిపోయింది.

సంగీతం వినిపించే మెట్లు..

అంతేకాకుండా దేవాలయంలో యత తీర్థంగా పిలువబడే కొలనులో స్నానం చేస్తే చర్మరోగాలన్నీ సమిసిపోతాయని  విశ్వసిస్తారు.

కోనేరు..

దారాసురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు కొని తీరాలనిపించే విధంగా ఉంటాయి..

అందమైన పట్టుచీరలు..


ఇలా చేరుకోవాలి..
సేలం లేదా తంజావూరుకు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో కుంభకోణం పట్టణానికి చేరుకోవాలి.అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాతేశ్వర దేవాలయానికి ప్రభుత్వ,ప్రైవేటు వాహనాల్లో చేరుకోవచ్చు.రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే చెన్నై నుంచి నేరుగా దరాసురం స్టేషన్‌కు చేరుకోవచ్చు.
విమాన
మార్గం : దారాసురానికి సమీప విమానాశ్రయం తిరుచనపల్లి. ఇక్కడ నుండి దారాసురం వరకు టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos