పౌర పట్టిక వివరాలు గల్లంతు

పౌర పట్టిక వివరాలు గల్లంతు

గువాహటి: జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అంతర్జాల వేదిక నుంచి అసోం పౌరుల తుది జాబితా వివరాలు గల్లంతయ్యాయి.ఇందుకు హోం, ఎఎన్నార్సీ అధికార్లు పేర్కొన్న కారణాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకు కారణం సాంకేతిక సమస్యని హోం శాఖ,సమాచార సాంకేతిక సంస్థతో గుత్తను పునరుద్ధరించక పోవటమని ఎన్నార్సీ అధికారులు పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిరుడు ఆగస్టులో అసోం ఎన్నార్సీ డేటాను అధికారిక వెబ్సైట్ www.nrcassam.nic.inలో నిల్వ చేసారు. ఇందుకు విప్రో క్లౌడ్ సర్వీస్ ఉపకరించింది. క్లౌడ్ సేవల కోసం విప్రోతో చేసుకున్న ఒప్పందం నిరుడు అక్టోబరు 19తో ముగిసింది. ఆ తర్వాత ఐటీ సంస్థ తన సేవలను నిలిపివేయటంతో గత డిసెంబరు 15 నుంచి సమాచారం కనిపించటం లేదని ఎన్నార్సీ సమన్వయ కర్త హితేశ్ దేవ్ శర్మ తెలిపారు. విప్రో సేవలు మొదలైతే ఎన్నార్సీ వివరాలు మళ్లీ అంతర్జాల వేదికపై దర్శనమిస్తుంది. రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos