జనసేన లాంగ్‌మార్చ్‌కు అనుమతి

జనసేన లాంగ్‌మార్చ్‌కు అనుమతి

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రత్యక్షంగా,పరోక్షంగా భవన నిర్మాణ కార్మికులు ఇతర అనుబంధ రంగాలలకు చెందిన వేలాది మంది కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వానికి ఎత్తిచూపే జనసేన విశాఖలో తలపెట్టిన ‘చలో విశాఖపట్నం’ లాంగ్ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేశారు.కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు, మద్దతుదారులు రాకుండా అడ్డుకునేందుకు కొందరు కావాలని లాంగ్ మార్చ్కు అనుమతిలేదంటూ ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి విశాఖలో మద్దిపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికుల గొంతు వినిపిస్తామన్నారు.లాంగ్ మార్చ్ యథావిధిగా జరుగుతుందని, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. అయితే లాంగ్ మార్చ్లో పాల్గొనే విషయంపై రాజకీయ పార్టీలు ఒక్కో విధంగా స్పందించాయి.ఇప్పటికే సంఘీభావం మాత్రం ప్రకటించిన బీజేపీ పవన్తో కలిసి వేదిక పంచుకోలేమని తేల్చి చెప్పింది.అదే సమయంలో టీడీపీ అధినేత మాత్రం తమ పార్టీకి చెందిన సీనియర్లు పవన్ ఆధ్వర్యంలో జరిగి ఈ మార్చ్ లో పాల్గొంటారని స్పష్టం చేశారు.మరోవైపు మిత్ర పక్షాలుగా భావిస్తున్న సీపీఐ..సీపీఎం మాత్రం తాము ఈ ర్యాలీలో పాల్గొనటం లేదని స్పష్టం చేస్తూ పవన్ కళ్యాన్ కు లేఖ రాశారు.పవన్ వైఖరి ఆమోదయోగ్యం కాదని అందుకే మార్చ్లో పాల్గొనడం లేదంటూ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos