చెన్నసంద్రం పంచాయతీలో సమస్యల తిష్ట

చెన్నసంద్రం పంచాయతీలో సమస్యల తిష్ట

హోసూరు యూనియన్ చెన్నసంద్రం పంచాయతీ విధ్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలకు నీరు లేక, చివరకు గ్రామాలలో తాగేందుకు నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని స్థానిక ప్రజలు నాయకులను,విధ్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. హోసూరు యూనియన్ చెన్నసంద్రం పంచాయతీ సమీపంలో దక్షిణ పినాకిని నది ప్రవహిస్తున్నందున పంచాయితిలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారు. చెన్నసంద్రం పంచాయితీ ప్రజలు సగానికి పైగా గ్రామాల సమీపంలోని పైమాసి భూములను తరతరాలుగా దున్నుకొని జీవనం చేస్తున్నారు. ఆ భూములకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అది అటుంచితే చెన్నసంద్రం పంచాయితీ సమీపంలో పైమాసి భూములు దున్నుతున్న బోరు బావులకు విద్యుత్ శాఖ అధికారులు తత్కాల్ పద్ధతిలో కూడా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నసంద్రం పంచాయితీ అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా ఆయన కూడా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పంచాయితీ అధ్యక్షుడు జయకుమార్ రెడ్డి పాలకపక్ష నేతలతో సన్నిహితంగా ఉంటున్నా పైమాసి భూములకు విద్యుత్ కనెక్షన్లు ఇప్పించడం లో విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నసంద్రం పంచాయితిలోనిని ఉలియాలం గ్రామంలో తరతరాలుగా పైమాసి భూములను దున్నుతున్న ఇద్దరు దళిత రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్ లను మంజూరు చేసినా సంబంధిత అధికారులు వాటిని నిలుపుదల చేశారని, దానికి కారణాలు ఇంతవరకు తెలియపరచలేదని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం రైతుల కోరిక మేరకు తత్కాల్ పద్ధతిలో బోరు బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి, ప్రభుత్వానికి ఆభూములు అవసరమున్నప్పుడు తిరిగి తీసుకున్నా నష్టమేమీ లేదని అంతవరకు రైతులు ఆభూములలో ఆటలు పండించేవిధంగా ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెన్నసంద్రం పంచాయితీ ప్రజలు కోరుతున్నారు. ఒక పక్క పొలాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు నానా తంటాలు పడుతుంటే గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ఏ నాయకుడు పట్టించుకోలేదని చెన్నసంద్రం పంచాయితీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos