భారతీయులకు స్విస్ ఆఖరి ఛాన్స్..

భారతీయులకు స్విస్ ఆఖరి ఛాన్స్..

కష్టపడి సంపాదించారో, లేక అక్రమంగా కూడబెట్టారో తెలియదు కానీ 12 మంది భారతీయులు తమ డబ్బును తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు. ఎందుకనో వారు ఆ డబ్బును ఏళ్ల క్రితం డిపాజిట్ చేసి, ఇంతవరకూ తాకలేదు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు రూ. 300 కోట్లకు పైగానే ఉంది. అయితే అలా జమ చేసి ఇప్పటివరకూ ఖాతా వైపు తొంగిచూడని వారు ఎందరో ఉన్నారట.. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండంతో ఆ సొమ్మును అలాగే వదిలేస్తున్నారట.. అలా మొత్తం 2,600 ఖాతాల్లో ఎన్నాళ్లో నుంచి ఎటువంటి లావాదేవీలు లేకుండా రూ.300 కోట్లకు పైగా మూలుగుతోంది. ఇప్పుడు ఈ సొమ్మును సదురు వ్యక్తుల వారసులు ఆధారాలతో సహా వచ్చి తీసుకోవాలని.. లేదంటే అదంతా స్విస్ ప్రభుత్వ ఖాతాల్లోకి జమ అవుతుందని స్విట్టర్లాండ్ ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. సదురు భారతీయుల వారుసులు ఆ 300 కోట్లను ఈనెల 15వ తేదీలోగా వచ్చి ఆధారలతో వచ్చి బ్యాంకులో కలిస్తే ఆ మొత్తం అందజేస్తారు. లేదంటే స్విస్ ఖాతాల్లోకి చేరిపోతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. భారతీయుల 12 ఖాతాల్లో రెండు ముంబై కోల్ కతా నగరాలకు చెందిన అడ్రస్ లున్నాయి. ఇక ఒకటి డెహ్రాడూన్ కు చెందిన వ్యక్తిది. కొన్ని ఖాతాలు మాజీ సంస్థానాధీశులవీ.. బ్రిటీష్ కాలంలో బ్రిటన్ ఫ్రాన్స్ లో స్థిరపడిన భారతీయుల ఖాతాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలిసింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos