టాప్ ఆర్డర్పై ఒత్తిడి…ఇదే మా వ్యూహం

టాప్ ఆర్డర్పై ఒత్తిడి…ఇదే మా వ్యూహం

హామిల్టన్‌: బంతిని స్వింగ్‌ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటే తాను భిన్నమైన బౌలర్‌గా కనిపిస్తానని న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో 10 ఓవర్లు వేసిన బౌల్ట్‌ 21 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీమిండియాను 92 పరుగులకే కుప్పకూల్చాడు. మ్యాచ్‌ విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్లే ఇలా జరిగింది. గాల్లో బంతి అలా కదలడం చాలా బాగుంది. బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు నేనో భిన్నమైన బౌలర్‌గా కనిపిస్తాను. నాలుగో వన్డేలో అలాగే అనిపించింది. సిరీస్‌ను ఓటములతో ఆరంభించడం చిరాకు పరిచే అంశం. మాకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి. వనరులు ఉన్నాయి. అనుకూలంగా ఉన్న రోజు మేం రెచ్చిపోగలం. ఓపెనింగ్‌ బౌలర్‌గా బౌలింగ్‌ దళాన్ని ముందుకు నడిపించడం, బ్యాట్స్‌మెన్‌ను తప్పుదారి పట్టించడం నా బాధ్యత. తిరిగి పుంజుకున్నందుకు సంతోషంగా ఉంది. భారత్‌లో కోహ్లీ లేడు. టాప్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచాలన్నది మా ప్రణాళిక. అమలు చేశాం. విజయం సాధించాం’ అని బౌల్ట్‌ అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos