ఎన్నికల కోసం అమానుష చర్యను కప్పి పుచ్చారు

ఎన్నికల కోసం అమానుష చర్యను కప్పి పుచ్చారు

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే ప్రభుత్వ యంత్రాగం నిర్లక్ష్యం కారణంగానే వైశాలి జిల్లాలో యువతి ఆమానుష మృతిని కప్పి పెట్టారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళ వారం చేసిన ట్వీట్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తప్పు బట్టారు. ‘ఎవరి నేరం మరింత ప్రమాదం? ఈ అమానుషానికి పాల్పడింది ఎవరు? ఎన్నికల ప్రయోజనాల కోసం, ఇలాంటి అవకతకవలక పాలనను సుపరిపాలన అంటూ మాయ మాటలు చెప్పి, అసలు ఏం జరిగిందనే విషయాన్ని దాచిపెట్టిందెవరు?’ అని ప్రశ్నించారు. 20 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు వేధించి, ఆ తరువాత నిప్పుపెట్టారు. పాట్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని మృతురాలి కుటుబ సభ్యులు పాట్నాలోని కార్గిల్ చౌక్ వద్ద నిరసనకు దిగారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos