పౌరసత్వ చట్ట సవరణ దేశానికి ముప్పు

పౌరసత్వ చట్ట సవరణ దేశానికి ముప్పు

గ్యాంగ్టక్: పౌరసత్వ చట్ట సవరణ ‘అత్యంత ప్రమాదాకారి’ అని భారత పుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా(43) ఆందోళన వ్యక్తీకరించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి భారత్కు తరలి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే సవరణ ముసాయిదాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ సిక్కిం ప్రజల ప్రయోజ నాల ను దృష్టిలో ఉంచుకుని చేయలేదని ఆరోపించారు. ‘బంగ్లాదేశ్కు దగ్గరగా ఉన్న కారణంగా ఇప్పటికే బెంగాల్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటు న్నాయి. సిక్కిం కూడా బంగ్లా దేశ్కు చాలా దగ్గరగా ఉన్నందున దీర్ఘ కాలంలో ఇబ్బందుల కు గురవుతుంద’ని హమ్రో సిక్కిం పార్టీ అధినేత కూడా అయిన భైచుంగ్ భూటియా పేర్కొన్నారు. సిక్కిం క్రాంతికారి మోర్చా, భాజపా సారథ్యంలో నడుస్తున్న సిక్కిం ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతర ఈశాన్య భాజపా మిత్రపక్షాలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శాసనసభలో దీన్ని తాము ఆక్షేపిస్తామని చెప్పారు. సిక్కింలో ఆర్టికల్ 371 (ఎఫ్)లో సిక్కిం సబ్జెక్ట్ యాక్ట్, రాజ్యాంగం ఉందన్నారు. ముస్లిం లపై వివక్ష చూపేందుకు భాజపా ప్రభుత్వం దిగజారుడు రాజకీ యాలు చేస్తుందని విపక్షాలు దుయ్యబట్టాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos