ముంబైలో ‘బెస్ట్’ సమ్మె

ముంబైలో ‘బెస్ట్’ సమ్మె

ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తున్నందున బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లే, ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) ఉద్యోగుల సంఘాలు సోమవారం సమ్మెకు పిలుపు నిచ్చాయి. వైరస్ వల్ల ఇప్పటి వరకూ ఉద్యోగుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. 120 మందికి కరోనా సోకింది. బెస్ట్ సిబ్బంది నిర్ణయం నగరానికి మరింత ప్రమదకరంగా మారనుంది. ప్రస్తుతం నగరంలో బెస్ట్ బస్సులు మాత్రమే పని చేస్తున్నాయి. సబర్బన్ రైళ్ల సేవలు నిలిపి వేసిన అనంతరం ముంబై అంతటా అత్యవసర సేవల ఉద్యోగుల కోసం బెస్ట్ బస్సులు ముఖ్యపాత్ర పోషించాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తమ సిబ్బందికి తగిన భద్రతా చర్యలు అందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచిన్నట్లు యూనియన్ అధినేత శశాంక్ రావు తెలిపారు. కార్మికులకు ప్రత్యేక క్వారంటైన్, ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కింద కోటి రూపాయలతోపాటు కుంటుంటంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెస్ట్ బస్సులకు బదులుగా కనీసం 1,200 మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos