సెబికి రూ.15,448కోట్లు జమ చేసిన సహారా

సెబికి రూ.15,448కోట్లు జమ చేసిన సహారా

రూ.15,448కోట్లు జమ చేసిన సహారా
న్యూఢిల్లీ: అనుమతులు లేకుండా డిబెంచర్లు జారీ చేసి నిధులు సమీకరించిన నేరారోపణలు ఎదుర్కొంటున్న సహారా రియాల్టీ, హౌసింగ్ సంస్థలు రూ.15,448కోట్లను సెబీ-సహారా రిఫండ్ ఖాతాలో జమ చేశాయి. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం లోక్సభలో లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. సెబీకి తగిన పత్రాలు సమర్పించకుండా సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లు 3.07 కోట్ల మంది నుంచి వరుసగా రూ.19,400.87కోట్లు, రూ.6,380.50 కోట్లు సేకరించాయి. నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన ఆ మొత్తాలను వడ్డీతో సహాచెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం సహారాను ఆదేశించింది. దీని ప్రకారం గత ఫిబ్రవరి ఒకటికి ఆ సంస్థ ‘సెబి-సహారా రిఫండ్ ఖాతా’లో రూ.15,448కోట్లు జమ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos