ఆఫీసుకు రావాలన్నందుకు.. ఉద్యోగాన్నే వదిలేసారు

ఆఫీసుకు రావాలన్నందుకు.. ఉద్యోగాన్నే వదిలేసారు

వాషింగ్టన్: కరోనా తగ్గుముఖం పడుతుండడంతో ఉద్యోగులను ఆఫీసులకు వివిధ సంస్థలు రప్పిస్తున్నారు. వీటిలో యాపిల్ కూడా ఉంది. హైబ్రిడ్ వర్క్ కు సంస్థ ఆదేశా లిచ్చింది. ఆఫీసుకు రావాలంటూ ఉద్యోగులకు సూచించింది. అది నచ్చని సంస్థ మెషీన్ లెర్నింగ్ విభాగ డైరెక్టర్ ఇయాన్ గుడ్ ఫెలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సిబ్బందికీ లేఖ విడుదల చేశారు. ఏప్రిల్ 11 నాటికి వారంలో కనీసం ఒక్కరోజు, మే 2 నాటికి వారంలో రెండు రోజులు, మే 23 నాటికి కనీసం మూడు రోజులు ఆఫీ సులో పని చేయాలని ఆదేశాలచ్చింది. ఇయాన్ సహా చాలా మంది ఉద్యోగులు ఆ ఆర్డర్స్ పై విముఖత వ్యక్తం చేశారు. సమ్మిళితమైన నిర్ణయాలు లేకుండా కుటుంబం, వారి బాగోగులా లేదా సంస్థ, సంస్థ పని తీరును ఎంచుకోవాలంటూ తమకు ఓ టాస్క్ పెట్టారని, ఆ నిర్ణయం అంత తేలికైనదేమీ కాదని పేర్కొన్నారు. దానిపై ఎలాంటి నిర్ణ యమూ తీసుకోలేమని చెప్పారు. ఆఫీసుకు వచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos