మీ బుద్ధి మారదా??

  • In Film
  • February 22, 2019
  • 430 Views
మీ బుద్ధి మారదా??

సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగాక అన్ని రంగాల్లో కూడా విప్లవాత్మక
మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో.సామాజిక మాధ్యమాల వల్ల సినీ ప్రముఖులు,అభిమానులు,ప్రజలకు
మధ్య దూరం అంతరం చాలా తగ్గింది.అభిమానులు తమ అభిమాన నటీనటులతో అభిప్రాయాలు,సూచనలు నేరుగా
వారితోనే పంచుకునే అవకాశం లభించింది.ఈ అవకాశాన్ని కొంతమంది సక్రమంగా వినియోగించుకుంటుంగా
మరికొంత మంది తమ పైత్యాన్ని ప్రదర్శిస్తూ సినీ ప్రముఖులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.ఈ
క్రమంలో ప్రముఖ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టార్గెట్ అవుతూనే ఉన్న విషయం తెల్సిందే.అనసూయ
చేసే పోస్ట్‌లపై పాజిటివ్‌గా స్పందించే వారి సంఖ్య ఎంత ఉంటుందో విమర్శించే వారి సంఖ్య
కూడా అంతేస్థాయిలో ఉంటోంది.తాజాగా అనసూయ పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన జవాన్ లకు నివాళ్లు అర్పిస్తూ పోస్ట్ చేసి వీడియోలు,ఫొటోలను షేర్ చేసారు. ఉగ్ర దాడి నేపథ్యంలో అనసూయ చేసిన ట్వీట్స్ కు కూడా కొందరు ట్రోల్ చేస్తూ కామెంట్స్ అనసూయ కలత చెందారట. కామెంట్స్ కు వీడియో రూపంలో సమాధానం ఇచ్చారు. ‘నాకు చాలా మాట్లాడాలని ఉంది నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తానంటూ’ మొదలు పెట్టిన అనసూయ మన దేశంలో పట్టించుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఏ సమస్య గురించి మాట్లాడినా చివరకు నా డ్రస్ గురించి నా ప్రొఫెషన్ గురించి కామెంట్స్ చేయడం అందరికి అలవాటు అయ్యింది. నేను తాజాగా పుల్వామా దాడి గురించి ఒక ఎమోషనల్ కామెంట్ చేస్తే దానికి కొందరు షోలు చేసుకో వెళ్లు.. పొట్టి డ్రస్ లు వేసుకుని స్టేజ్ పై స్టెప్పులు వెయ్యి పో అంటూ కామెంట్ చేశారు.ఆ కామెంట్స్ కు ఆ రాత్రి నేను నిద్ర కూడా పోలేక పోయాను. అసలు వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏ విషయంలో పోస్ట్ చేసినా కూడా చివరకు నా డ్రస్ లపై వీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న వారు మీ మీ పనులు సక్రమంగా చేసుకుంటున్నారా.. మీ ఫ్యామిలీ మెంబర్స్ ను గౌరవిస్తున్నారా.. నా పని నేను చేసుకుంటున్నాను మరి మీరు మీ పని చేసుకుంటున్నారా అంటూ ఆగ్రహంగా ప్రశ్నించింది. మీరు ఇకనైన మారరా మీ బుద్ది మారదా అంటూ సీరియస్ గా కామెంట్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos