ఆమ్నెస్టీ కార్యకలాపాలకు తెర

ఆమ్నెస్టీ కార్యకలాపాలకు తెర

న్యూ ఢిల్లీ: దేశం లో తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ-ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మంగళ వారం ఇక్కడ ప్రకటించింది. 2020 సెప్టెంబర్ 10న తమ బ్యాంకు ఖాతాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని తెలిపింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగా తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ విమర్శించింది. తాము దేశంలో అత్యాయిక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆరోపించింది. మానవ హక్కులు ఉల్లంఘనల్ని అధ్యయనం చేసిన సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదన్నారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పని చేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos