తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా

తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ శూన్యతను ప్రజా పోరాటాల ద్వారా భర్తీ చేస్తామన్నారు. తమ పార్టీలో చేరడానికి ఇప్పటికే చాలా మంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుని తెరాస తప్పు చేయడం భావ్యం కాదన్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనే అని జోస్యం చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు, కుటుంబ పాలనపై పోరాటాలను ఉధృతం చేస్తామని ప్రకటించారు. తెదేపా కనుమరుగైందని, కాంగ్రెస్‌ మునిగిపోతున్న నావ అని, ఈ రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని 2023లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos