తూటాలకు బలయ్యేందుకు పుట్టలేదు

తూటాలకు బలయ్యేందుకు పుట్టలేదు

న్యూ ఢిల్లీ: ‘ఎన్ఆర్పీ అనేది ఎన్ఆర్సీకి డేటాబేస్గా ఉపయోగ పడుతుంది. దీన్ని దేశప్రజలు వ్యతిరేకించాలని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ పిలుపు నిచ్చారు. ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శ నలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళన కారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఎన్ఆర్సీని ముస్లీంలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకు వచ్చింది. ఎన్ఆర్పీ పేరుతో అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి మీకు సంబంధించిన పేరు, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్లను అడిగి నమోదు చేసుకుంటారు. అప్పుడు వీరు వారికి సరైన వివరాలు ఇవ్వ వద్దు. మనం తూటాల్ని ఎదుర్కొవడానికి ఇక్కడ పుట్టలేదు. రాంలీల మైదానంలో జరిగిన భాజపా ర్యాలీలో ప్రధాని మోదీ అన్నీ అబద్దాలు చెప్పారు. ఎన్ఆర్సీ గురించి నోరు విప్పకుండా దేశంలో ఎటువంటి నిర్బంధ శిబిరాలు లేవన్నారు. కేంద్రం ఎన్ఆర్పీ పేరుతో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను ప్రజలపై రుద్దాలనుకుంటోంది. వాటిని ఎదుర్కొవాలంటే అన్ని రాష్ట్రాల్లోని ప్రజ లు పోరాడాలి. ఉత్తరప్రదేశ్లో ముస్లింలపై అనేక దాడులకు జరుగుతున్నాయని.. అక్కడ పోలీసులు ముస్లింలను దోపిడీ చేస్తు న్నా ర’ని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos