స్పెయిన్‌లో సైతాను విగ్రహ వివాదం: ‘నవ్వుతూ, సెల్ఫీ తీసుకున్నట్లుంటే కుదరదు’

స్పెయిన్‌లో సైతాను విగ్రహ వివాదం: ‘నవ్వుతూ, సెల్ఫీ తీసుకున్నట్లుంటే కుదరదు’

స్పెయిన్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సైతాను శిల్పం చూడటానికి చాలా స్నేహపూర్వకంగా ఉందంటూ వివాదం రేగింది.కంచుతో తయారైన ఈ శిల్పాన్ని స్పెయిన్‌లోని సెగోవియా నగరంలోని ఓ వ్యక్తి గౌరవార్థం ‘ప్రముఖ కాలువపైకి ఎక్కిన దెయ్యం’ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.కానీ, స్థానికులు మాత్రం ఈ భూతం నవ్వుతూ, సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఉందని, చూడటానికి చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ శిల్పం క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఉందో లేదో పరిశీలించేవరకూ దీని ఏర్పాటును తాత్కాలికంగా ఆపేయాలని జడ్జి ఆదేశించారు.దీని ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ నగరంలోని దాదాపు 5400 మంది (అక్కడి జనాభాలో 10శాతం పైగా) ఓ పిటిషన్‌పై సంతకాలు చేశారు.ఫోన్ పట్టుకుని నవ్వుతూ ఉన్నట్లున్న ఈ శిల్పం దెయ్యాలను ఎక్కువ చేసి చూపుతున్నట్లు ఉందని, ఇది క్యాథలిక్కులకు అభ్యంతరకరంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ శిల్పం చాలా కోపంగా, అసహ్యంగా ఉంటూనే ఎలాంటి హానీ చేయదనిపించే విధంగా ఉండాలని వారంటున్నారు.శిల్పాన్ని రూపొందించిన కళాకారుడు జోస్ ఆంటోనియో అబెల్లా ఈ అభ్యంతరాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.”ఓ గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని ఎందుకింత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ నగరం అంటే చాలా ఇష్టం. మూడు దశాబ్దాలు ఇక్కడే నివసించాను. దానికి కృతజ్ఞతగా సెగోవియాలో ఈ శిల్పాన్ని ఏర్పాటుచేయాలనుకున్నా. ఈ శిల్పాన్ని రూపొందించడానికి నేను డబ్బు తీసుకోలేదు. డబ్బుల కోసం నేను దీన్ని చేయట్లేదు, నేను నివసించిన నగరానికి నేనిచ్చే నివాళి ఇది. నా భావాలను అర్థం చేసుకోండి.” అని జోస్ విజ్ఞప్తి చేశారు.ఈ విగ్రహంపై వివాదం అసంబద్ధంగా ఉండని నగర్ కౌన్సిలర్ క్లాడియా డి శాంటోస్ వ్యాఖ్యానించారు. అనుకున్నవిధంగా విగ్రహం ఏర్పాటు జరిగేందుకు ప్రయత్నిస్తానని ఆమె ‘ఎల్ పైస్’ పత్రికతో తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos