సుమ ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉందే!

  • In Film
  • January 24, 2019
  • 198 Views
సుమ ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉందే!

అలీ- సుమ మధ్య టిట్ ఫర్ ట్యాట్ .. ఎలుక పిల్లి ఆట గురించి తెలిసిందే. ఆడియో వేదికలపై ఏదో ఉత్సాహంలో ఏదో ఒక మాట అనేస్తుంటాడు అలీ. అందుకు సుమ తిరిగి కవర్ చేసుకోలేక నానా తంటాలు పడుతుంటుంది. నేటి సాయంత్రం లవర్స్ డే (ఒరు ఆధార్ లవ్) ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ అలాంటి సన్నివేశమే ఎదురైంది. ఈ వేదికపైకి వచ్చిన ప్రియా వారియర్ అలీకి చెల్లెలు వరస! అంటూ సుమ పరాచికం ఆడితే సరే ఈ హీరో రోషన్ నీకు కొడుకు వరుసా? అంటూ కాస్తంత మోటైన సరసమే ఆడాడు. నీకు ఇంత కొడుకు ఉన్నాడా.. అయితే రాజీవ్ కనకాల కేరళ ఎప్పుడు వెళ్లాడో!! అంటూ కాస్తంత బూతు కామెడీనే చేశాడు అలీ.

ఇదివరకూ ఓ సందర్భంలో ఇదే తరహాలో అలీ చేసిన కామెడీ మిస్ ఫైరై సుమ అలకపాన్పు ఎక్కడం గొడవకు దిగడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాస్త మాట తూలినా అలీ కామిక్ టైమింగ్ వల్ల దానిని జనం పట్టించుకోలేదు. ఇక ఈ వేడుకలో సుమపై దర్శకుడు మారుతి అదిరిపోయే పంచ్ నే వేశాడు. ఆడియోలో అందరూ మలయాళీలే.. సుమ ఫ్యామిలీ ఫంక్షన్ లా ఉందే! అంటూ సెటైర్ వేసేశాడు. మొత్తానికి ఈవెంట్ ని చాలా ఫన్నీగా లైవ్ లీగా జరిపించారు వీళ్లంతా.

ఈ వేదికపై మారుతి మాట్లాడుతూ -“లాస్ట్ ఇయర్ కొట్టిన కన్ను ఈ ఇయర్ ముందుకొచ్చింది.. ఒక చిన్న టీజర్ తో ప్రేమించి తర్వాత సినిమాని కొని గురు రాజ్ చాలా ప్యాషన్ తో `లవర్స్ డే` అని టైటిల్ పెట్టి వేలెంటైన్స్ డేకి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజుల్లో సినిమాకి వచ్చి బ్లెస్ చేశాడు బన్ని. ఈ సినిమాకి తను వచ్చాడు కాబట్టి మంచి హిట్ అవుతుంది“ అని అన్నారు. షాన్ రెహమాన్ పాటలు ఇష్టం. ఒమరు లులు హ్యాపి వెడ్డింగ్ లాంటి హిట్ సినిమాని తీశారని తెలిపారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos