బడ్జెట్ ప్రసంగం.. పొగడ్తలకే పావుగంట..

న్యూఢిల్లీ: తాత్కాలిక ఆర్ధిక మంత్రి పియూష్‌ గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో తొలి పావుగంట నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని పొగిడేందుకే కేటాయించారు. అవినీతి నిర్మూలన, పారదర్శకత పెంపు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణానికి కళ్లెం సహా కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలను ఏకరువు పెట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగులుతూ… ‘‘ఇంతకీ బడ్జెట్ ఎక్కడ?’’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం హయాంలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందంటూ ఆయన వ్యాఖ్యానించినప్పుడు సైతం ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. రైతుల నుంచి వెల్లువెత్తుతున్న అసంతృప్తే మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా రాజకీయ విశ్లేషకులు చెబుతుండడం గమనార్హం. దీని కారణంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసినట్టు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos