ప్రభాస్ హీరోయిన్ కు పెళ్లి సెట్ అయింది

  • In Film
  • January 16, 2019
  • 889 Views
ప్రభాస్ హీరోయిన్ కు పెళ్లి సెట్ అయింది

ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యాయకు పెళ్లి కుదిరింది. తన క్లాస్ మేట్ “జో”ను త్వరలోనే పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది రిచా. ఈ సందర్భంగా కాబోయే భర్తతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది. “ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఎంగేజ్ మెంట్ పూర్తయింది. నేను, జో బిజినెస్ స్కూల్ లో కలిశాం. రెండేళ్లు అద్భుతంగా గడిచిపోయాయి. నా జీవితంలో ఓ కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నాను. పెళ్లి తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు.” ఇలా తన పెళ్లి మేటర్ ను అఫీషియల్ గా ప్రకటించింది రిచా గంగోపాధ్యాయ. ఇకపై తను అమెరికాలోనే ఉండబోతున్నానని, సినిమాలు చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేసింది ఈ బ్యూటీ. భాయ్ సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది రిచా. ఆ సినిమా దెబ్బకు దర్శకుడు వీరభద్రమ్ చౌదరి ఎలాగైతే పత్తాలేకుండా పోయాడో, ఆ ఎఫెక్ట్ రిచాపై కూడా అదే స్థాయిలో పడింది. చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నానని అప్పట్లో స్పష్టంచేసిన రిచా, ఇప్పుడు ప్రేమ-పెళ్లి-జీవితం అన్నీ అక్కడే అంటోంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos