క్రిష్ అస్సలు తగ్గడం లేదుగా..!

  • In Film
  • January 31, 2019
  • 141 Views
క్రిష్ అస్సలు తగ్గడం లేదుగా..!

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ కు వివాదాలు అసలు కొత్త కాదు.  ఆమె వివాదాలను వెతుక్కుంటుందో లేదా వివాదాలే ఆమెను వెతుక్కుంటూ వస్తాయోగానీ ఆమె వివాదాలకు జడిసే రకం కానే కాదు.  బాలీవుడ్లో కంగనా జోలికి పోవాలంటే ఎవరైనా ఒకటికి పదిసార్లు అలోచిస్తారన్నది నిజం. అలాంటి పరిస్థితిలో దర్శకుడు క్రిష్ రీసెంట్ గా ‘మణికర్ణిక’ గురించి నేషనల్ మీడియాకు లెంగ్తీ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ‘మణికర్ణిక’ విషయంలో తన వైపు వెర్షన్ ను వినిపించడం.. కంగనాను తప్పుబట్టడం నిప్పును రాజేసింది.దీనికి సమాధానంగా కంగనా సోదరి రంగోలి చందేల్ రంగంలోకి దిగి ట్విట్టర్ ద్వారా క్రిష్ పై దాడి మొదలు పెట్టింది.  కంగనా తప్పేమీ లేదని.. అసలు ప్రాజెక్టును ఒడ్డుకు చేర్చింది కంగనానే అని చెప్తూ తన వాదనకు మద్దతుగా కంగనా – క్రిష్ ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ షేర్ చేసింది. డిసెంబర్ 6 న సినిమా చూడడానికి రమ్మని కంగనా క్రిష్ ను పిలిచిందని.. ఈ విషయంపై మీరేం చెబుతారని క్రిష్ ను ప్రశ్నించింది.దీనికి క్రిష్ కూడా సై అంటే సై సై అన్నట్టుగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్రిష్ జవాబిచ్చాడు.  ఒక మనిషి చెప్పే అబద్ధాల వలన నా ఫిలిం మేకింగ్ ఎబిలిటీస్ గురించి నన్ను నేను సమర్థించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ ట్వీట్ చేశాడు.  ‘మణికర్ణిక’ సినిమాకు పనిచేసిన కొంతమంది ఈ సినిమా చూసిన తర్వాత తనతో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసి నిజాలు అందరూ తెలుసుకోవాలని కోరాడు.  చూస్తుంటే ఈ రచ్చ ఇంతటితో ఆగేలా లేదు.  కంగనా ఇప్పుడు మరేం కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos