ఊరినే ఖాళీ చేయించిన కోతి!

ఊరినే ఖాళీ చేయించిన కోతి!

 ఒక వానరం చేష్టలను తట్టుకోలేక ఓ ఊరే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని సీర్గాళీ, సమీపంలోని తెన్నల్కుడి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, గ్రామంలో దాదాపు 60కి పైగా కుటుంబాలు నివాసం ఉంటుండగా, నెల రోజుల క్రితం ఓ కోతి వచ్చి చేరింది. అప్పటి నుంచి వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇళ్లల్లో చొరబడి ఆహారాన్ని ఎత్తుకెళ్లడంతో మొదలైన కోతి చేష్టలు, ప్రజలపై దాడుల వరకూ వచ్చాయి. గ్రామంలోని పశువులను, కుక్కలను కరుస్తోంది. కోతి దాడిలో 70 సంవత్సరాల వృద్ధ మహిళ నరాలు తెగి కోమాలోకి వెళ్లిపోయింది. దీన్ని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసినా, అది తెలివిగా తప్పించుకుంటూ మరింతగా రెచ్చిపోయింది. దీంతో గ్రామ ప్రజలు స్థానిక ఇళ్లు ఖాళీ చేసి, కట్టుబట్టలతో స్థానిక ఆలయంలోకి వెళ్లారు. కోతిని పట్టుకున్న తరువాతనే తాము తిరిగి ఊర్లోకి వస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన తిరువారూరు అటవీ శాఖ అధికారులు, కోతులను పట్టుకునే నిపుణులను పిలిపించామని, దాన్ని త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos