ఆకాశంలో నేడు ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే

ఆకాశంలో నేడు ఖగోళ అద్భుతం.. జీరో షాడో డే

బెంగళూరు: బెంగళూరువాసులు బుధవారం ఒక అరుదైన ఖగోళ అద్భుతాన్ని చూడనున్నారు. అదే జీరో షాడో డే. ఈ ఖగోళ అద్భుతం బెంగళూరు వాసుల నీడను అదృశ్యం చేస్తుంది. నగరంలో ఇవాళ మధ్యాహ్నం 12:17, 12:23 మధ్య ఇది ఏర్పడనుంది. జీరో షాడో డే సంవత్సరానికి రెండుసార్లు సంభవిస్తుంది. ఆరోజు సూర్య కిరణాలు నేరుగా తలపై పడతాయి. సూర్యుడి కోణం భూమి ఉపరితలంపై లంబంగా ఉన్నప్పుడు భూమధ్యరేఖ సమీపంలో ఉన్న ప్రాంతాలలో ఇది ఏర్పడుతుంది. ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. జీరో షాడో డే +23.5, -23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్న అన్ని ప్రదేశాలలో సంవత్సరానికి రెండుసార్లు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు నిట్ట నిలువునా తలపై పడతాయి. కానీ కొంచెం తక్కువ ఎత్తులో, ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపునకు కిరణాలు ప్రసరిస్తాయి. ఫలితంగా భూమిపై జీరో షాడో ఏర్పడుతుంది. ఈ రెండు రోజులలో సూర్యుడు సరిగ్గా తలపై ఉంటాడు. భూమిపై ఇలాంటి వింత సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి వీటిలో ఒక భాగమే. జీరో షాడో డే  కూడా అలాంటిదే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos