చర్చల తర్వాత వేయి కాళ్ల మంటపం

చర్చల తర్వాత వేయి కాళ్ల మంటపం

ఒంగోలు: పీఠాధిపతులతో పాటు అందరితో చర్చించి వెయ్యి కాళ్ల మండప నిర్మాణం గురించి నిర్ణయాన్ని తీసుకుంటామని తితిదే పాలక మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రతి భక్తుడికి త్వరగా శ్రీ వారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని,తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. తితిదే నిధులను భక్తులు అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తా మన్నారు. నగల అక్రమాలతో పాటు ఇతర అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించారు. తితిదే పాలక మండలిలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యాన్ని కల్పించే విషయాన్ని ఆలోచిస్తున్నామని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos