ఈ బౌలర్లను ఎదుర్కోవడానికి కష్టపడ్డా

  • In Sports
  • June 13, 2019
  • 147 Views
ఈ బౌలర్లను ఎదుర్కోవడానికి కష్టపడ్డా

ముంబై : శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, ఆసీస్‌ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ల బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమని క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తెలిపాడు. రెండు రోజుల కిందట రిటైర్మెంట్‌ను ప్రకటించిన అతను ఇక్కడ పిచ్చాపాటీగా మాట్లాడుతూ విదేశ ఆటగాళ్లలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అంటే ఎంతో అభిమానిస్తానని చెప్పాడు. పాంటింగ్‌తో పాటు వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌లతో ఆడడాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపాడు. గత ఏడాదే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలనుకున్నానని చెప్పాడు. అయితే అప్పట్లో కుదరలేదని చెబుతూ, ఈసారి ఐపీఎల్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos